రసాభాసగా మారిన జీహెచ్‌ఎంసీ కౌన్సిల్

గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ బడ్జెట్ సమావేశాలు రసాభాసగా మారాయి. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ సభ్యుల మధ్య సభలో వాగ్వాదం చోటు చేసుకుంది. సభ ప్రారంభం కాగానే బడ్జెట్‌పై మాట్లాడాలని మేయర్ విజయలక్ష్మి కోరారు. అయితే ప్రశ్నోత్తరాల కోసం పట్టుబట్టిన బీఆర్‌ఎస్ సభ్యులు మేయర్‌కి వ్యతిరేకంగా ఆందోళనకు దిగారు. పోడియం దగ్గరకు దూసుకెళ్లి.. పేపర్లు చించి మేయర్‌పైకి విసిరారు. వారిని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సభ్యులు ప్రయత్నించడంతో తీవ్ర గందరగోళం ఏర్పడింది. ఆ గందరగోళం మధ్యే జీహెచ్ఎంసీ వార్షిక బడ్జెట్‌‌ను ఆమోదిస్తున్నట్లు మేయర్ గద్వాల విజయలక్ష్మి ప్రకటించారు.