ఇదెక్కడి చోద్యంరా బాబు.. ఇంటి తలుపులు‌.. గేట్లు ఎత్తుకెళ్తున్న అధికారులు..

పన్ను చెల్లింపులో నిర్లక్ష్యం వహిస్తున్న మొండి బకాయిదారులకు నిర్మల్‌ మున్సిపాలిటీ అధికారులు షాక్ ఇస్తున్నారు. మున్సిపల్ బకాయిలు చెల్లించని స్థానికులపై కొరడా ఝుళిపిస్తున్నారు. ఇప్పటికే రెడ్‌ నోటీసులను జారీ చేసినా.. మొండి బకాయిదారులు స్పందించకపోవడంతో తమదైన స్టైల్‎లో షాక్ ఇస్తున్నారు మున్సిపల్ అధికారులు. ఇంటికున్న తలుపులు , గేట్లు , విలువైన పర్నిచర్ స్వాధీనం చేసుకుని ఝలక్ ఇస్తున్నారు‌. నిర్మల్‌ జిల్లా కలెక్టర్ ఆశిష్ ఇచ్చిన ఆదేశాలను తూచా తప్పకుండా పాటిస్తూ పన్ను ఎగవేత దారులకు‌ తమదైన పద్దతిలో చుక్కలు చూపిస్తున్నారు.