గుంటూరులోని సంపత్ నగర్‌లో మెయిన్ రోడ్డులో కుక్కలు హడలెత్తిస్తున్నాయి. ఆ మార్గంలో నడుచుకుంటూ వెళ్తున్న ఆరేళ్ల బాలికపై వీధి కుక్కలు ఒక్కసారిగా దాడి చేశాయి. చిన్నారి భయంతో అరుస్తూ, పరుగు తీయగా అటుగా వెళ్తున్న మహిళలు సకాలంలో స్పందించి రక్షించారు. కుక్కలను తరమటంతో ప్రమాదం తప్పింది. కుక్కలు తరమడంతో భయంతో పరుగులు తీసిన బాలిక కింద పడటంతో గాయాలు అయ్యాయి. వెంటనే బాలికను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కాగా పది రోజులు క్రితం ఇదే ప్రాంతంలో ఆరేళ్ల బాలుడిపైనా కుక్కలు దాడి చేసిన సంగతి తెలిసిందే. గుంటూరు మేయర్ కావటి మనోహర్ నాయుడు, అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.