పేదలకు అందాల్సిన రేషన్ బియ్యం పక్కదారి పట్టింది. ఏకంగా రూ.30 లక్షల విలువైన రేషన్ బియ్యం అమ్ముకున్న ఒక అధికారి నిర్వాకం బట్ట బయలైంది. దాదాపు 5 వేల బస్తాల రేషన్ బియ్యం సొంత అవసరాలకు వాడుకొని విలాసవంతమైన జీవితాన్ని గడిపిన సివిల్ సప్లై డిటి సిహెచ్ విష్ణు అరెస్టుతో ఈ వ్యవహారం బయటపడింది. ఈ ఘటన తిరుపతి జిల్లాలో వెలుగులోకి వచ్చింది. పుత్తూరు సివిల్ సప్లయిస్ డిప్యూటీ తహాసిల్దార్ విష్ణును అరెస్ట్ చేసిన పోలీసులు.. పుత్తూరు పౌరసరఫరాల శాఖ గోదాము నుంచి రేషన్ బియ్యం అక్రమంగా తరలించినట్లు తేల్చారు.