ఈ ఐస్‌క్రీమ్ తింటే అంతే సంగతులు..! బేకరీ, ఐస్‌క్రీమ్ తయారీకేంద్రాలపై వరంగల్ పోలీసులు దాడులు చేశారు. గడువు ముగిసిన కెమికల్స్‌తో అపరిశుభ్రవాతావరణంలో ఐస్‌క్రీమ్స్ తయారీ చేస్తున్నట్టు గుర్తించారు. నాణ్యత ప్రమాణాలు పాటించకుండా బేకరీ ఫుడ్ తయారీ చేస్తున్న వ్యాపారులపై కేసులు నమోదు చేశారు. 30 రకాల ఐస్‌క్రీమ్ ప్రొడక్ట్స్ సీజ్ చేశారు పోలీసులు.