పెళ్లంటే ఆకాశమంత.. పందిరి, భూదేవంత పీటలు వేసి, కోట్లు కుమ్మరించి.. విందు, చుట్టాలు, వేలాది మందికి భోజనాలు, అంగరంగ వైభవంగా జరిపించేస్తుంటారు. ఇటీవల అంబానీల ఇంట పెళ్లి ఈ వర్ణనకు తగ్గట్టు జామ్‌జామ్‌గా చేశారు. అయితే తాజాగా ఓ జంట ఇంతకు మించి అన్నట్లు వినూత్నంగా ఆలోచించారు. తమ పెళ్లికి ఏకంగా ఐఫోన్లలో వెడ్డింగ్ కార్డ్‌లు పంచారు. అదేంటీ అనుకుంటున్నారా? అవును.. ఈ జంట తమ పెళ్లికి రావాలని అయినవాళ్లందరికీ ప్రత్యేకంగా ఐఫోన్లను పంచి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే ఇవి నిజంగా ఐఫోన్లు కాదండోయ్.. వీటిని ఓపెన్ చేస్తే వధూవరుల వివాహ ఆహ్వానం బలేగా చూపించారులే. ఇదెక్కడో విదేశాల్లోనో.. ఉత్తరాదిలోనో జరిగి ఉంటుందిలే అనుకుంటున్నారా? అస్సలు కాదు.. మన తెలుగు వాళ్ల క్రియేటివిటీలనే. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.