​పద్మశ్రీ పురస్కారం రావడం నా పూర్వజన్మ సుకృతం - రాజేంద్ర ప్రసాద్

​పద్మశ్రీ పురస్కారం రావడం నా పూర్వజన్మ సుకృతం - రాజేంద్ర ప్రసాద్ ​ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నాకు 'పద్మశ్రీ' పురస్కారాన్ని ప్రకటించడం నా జీవితంలో మర్చిపోలేని రోజు. ఈ గౌరవం కేవలం నాకు మాత్రమే దక్కింది అని నేను అనుకోవడం లేదు. ఇది తెలుగు హాస్యానికి, వినోదాన్ని కోరుకునే సామాన్య ప్రేక్షకుడికి దక్కిన గౌరవంగా భావిస్తున్నాను.