లక్షలు ఖర్చు చేసి.. పందెం కోళ్లను పెంచుతున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి! ఎందుకో తెలుసా?

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎన్టీఆర్ జిల్లా గంపలగూడెం మండలం కొనిజర్ల గ్రామానికి చెందిన చుంచు ఉదయభాను అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మరి కొంతమంది స్నేహితుల సహకారంతో పందెం కోళ్ళ పెంపకం చేపట్టాడు. సంక్రాంతి సాంప్రదాయ వేడుకలు ఘనంగా జరుపుకునేందుకు ఖమ్మం జిల్లా, వైరా మండలం, ఖానాపురం గ్రామం సమీపంలోని మామిడి తోటలో పాతిక లక్షల రూపాయల ఖర్చుతో 100 రకాల పందెం కోళ్ళు పెంచుతున్నాడు. ఆంధ్రాలో సంక్రాంతి సందర్భంగా నిర్వహించే కోడిపందాలకు యమ డిమాండ్ ఉంది. దీంతో తన స్వగ్రామమైన గంపలగూడెం మండలం నెమలి కొనిజర్లలో బొల్ల కరుణాకర్ రావు సారధ్యంలో నిర్వహించే కోడిపందాలకు 100 కోడిపుంజులను తయారు చేశాడు.