ఆపరేషన్ కగార్‌లో కీలక పురోగతి సాధించాయి భద్రతా బలగాలు. మావోయిస్టులకు కంచుకోటలాంటి కర్రెగుట్టల్లో జవాన్లు తొలిసారి జాతీయజెండా ఎగరవేశారు. వామపక్ష తీవ్రవాదంపై ఇది ప్రభుత్వం సాధించిన విజయం అంటున్నాయి భద్రతా బలగాలు. మార్చి 31, 2026లోపు మావోయిస్టుల అంతమే పంతంగా ఆపరేషన్ కగార్ చేపట్టిన కేంద్ర బలగాలు..అందులో భాగంగా మావోయిస్టులకు గట్టిపట్టున్న కర్రెగుట్టల్లో వేట కొనసాగిస్తున్నాయి.