Tiger Rare Video: ఇది చాలా రేర్ వీడియో..అమ్మ ముందు పులి పిల్లల అల్లరి మాములుగా లేదు..

పులి పిల్లలు కలిసి ఆడుకుంటున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఎంతటి క్రూర మృగాలైనా వాటి పిల్లలు కలిసి ఆడుకుంటుంటే చూసేందుకు.. అదొక ముచ్చటైన దృశ్యమే. ఈ దృశ్యం అందర్నీ ఆకట్టుకుంటోంది. అభయారణ్యాల్లో పులుల్ని సంరక్షిస్తూ వాటి పెరుగుదల కోసం శ్రమిస్తున్న ఫారెస్ట్ అధికారులపై నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.