90ML తాగినంత మాత్రాన పోలీసులు వేధిస్తారా..? హైదరాబాద్ మహా నగరంలోని పాతబస్తీ బహదూర్‌పురా ట్రాఫిక్ పోలీసులు తనిఖీలు నిర్వహించే సమయంలో ఓ విచిత్ర ఘటన చోటు చేసుకుంది. ట్రాఫిక్ నిబంధనలు పాటించని వాహనదారులను ఆపి చలాన్ విధిస్తున్నారు. ఈ క్రమంలోనే మద్యం సేవించిన వచ్చిన ఓ పెద్దాయన అటుగా వచ్చాడు. దీంతో అతన్ని ఆపిన ట్రాఫిక్ పోలీసులు ఫైన్ విధించేందుకు సిద్ధమయ్యారు. అంతే ఇంకేముంది ఒక్కసారిగా చిర్రెత్తుకొచ్చిన ఆయన రెచ్చిపోయాడు. నడి రోడ్డు మీద వీరంగం సృష్టించాడు.