సర్పంచ్ ఎన్నికల బరిలోకి సాఫ్ట్‌వేర్ కంపెనీ యజమాని..

సర్పంచ్ పదవి ఇప్పుడు యువతలో రాజకీయ ప్రయాణానికి తొలి మెట్టుగా మారింది. పెద్ద పెద్ద ఉద్యోగాలను వదిలి, గ్రామాభివృద్ధి కోసం బరిలోకి దిగుతున్న వారి జాబితాలో సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం జిల్లెలగడ్డ గ్రామానికి చెందిన యువకుడు లావుడ్య రవీందర్ కూడా చేరాడు.