సినీ హీరో దగ్గుబాటి వెంకటేష్ కాంగ్రెస్ తరఫున ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఖమ్మంలో కమాన్ ఖమ్మం అంటూ వెంకీమామ సందడి చేశారు. తన వియ్యంకుడు ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి గెలుపు కోసం ఖమ్మంలో వెంకటేష్ రోడ్ షో నిర్వహించారు. ఖమ్మం మయూరి సెంటర్ నుంచి వైరా రోడ్, జెడ్పీ సెంటర్ మీదుగా ఇల్లందు క్రాస్ రోడ్ వరకు రోడ్ షో కొనసాగింది.