బొజ్జగణపతికి 108 నైవేద్యాలు...గణాధ్యక్షుని గోదారోళ్ల రుచులు బొజ్జగణపయ్య నీ బంటు మేమయ్య అంటూ ఊరు వాడ వినాయకచవితి నుంచి పెద్ద ఎత్తున పూజలు జరుపుతున్నారు భక్తులు. అయితే గణాధ్యక్షనిగా బాధ్యతలు తీసుకునే సందర్బంలో ఆయన ప్రీతిపాత్రంగా భుజించడం , పార్వతీ పరమేశ్వరులకు మోకరిల్లి నమస్కరించ లేక ఆయాసపడటం, చంద్రుని పరిహాసం అందరికీ తెలిసిన కథే.