పనులన్నీ పక్కనబెట్టి చేను పిచికారీ చేసిన ఆంధ్రా మంత్రి!

రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు కనుమ పండుగను ప్రత్యేకంగా జరుపుకున్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు ఎమ్మెల్యే అయిన ఆయన, పండుగ రోజు కొంత తీరిక దొరకడంతో తన సొంత గ్రామానికి వెళ్లారు. ఆగర్తిపాలెంలోని పొలానికి వెళ్లి సామాన్య రైతులా వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు.