లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కయిన ట్రాఫిక్ ఎస్సై.. సస్పెండ్ చేసిన సీపీ రాష్ట్రమంతటా పెండింగ్ ట్రాఫిక్ చాలాన్స్ స్పెషల్ డ్రైవ్ జరుగుతుంటే.. ఆ ట్రాఫిక్ ఎస్సై మాత్రం తన కలెక్షన్ల స్పెషల్ డ్రైవ్ చేస్తున్నాడు. డ్రైవింగ్ లైసెన్స్ లేని యువకుల నుండి లంచం తీసుకున్న ఆ ట్రాఫిక్ ఎస్సై అడ్డంగా దొరికిపోయాడు. అతను లంచం తీసుకుంటున్న వీడియో పోలీస్ కమిషనర్ దృష్టికి చేరడంతో వారి పై సస్పెన్షన్ వేటు పడింది. ఈ సంఘటన హనుమకొండలో జరిగింది. హనుమకొండ ట్రాఫిక్ ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్న డేవిడ్ దర్జాగా లంచం తీసుకుంటూ ఒక వీడియోకి దొరికిపోయాడు.