కారు కింద పడిపోయిన మూడేళ్ల చిన్నారి... ఆ తర్వాత... CCTVలో యాక్సిడెంట్‌ రికార్డ్‌

కారు కింద పడిపోయిన మూడేళ్ల చిన్నారి... ఆ తర్వాత... CCTVలో యాక్సిడెంట్‌ రికార్డ్‌ గుజరాత్‌లోని నవ్‌సరి జిల్లాలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగు చూసింది. ఆ హృదయ విదారకమైన సంఘటన నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇంటి ఆరుబయట ఆడుకుంటున్న 3 ఏళ్ల చిన్నారి మీది నుంచి ఓ కారు పోయింది. కానీ, కుటుంబ సభ్యుల అప్రమత్తత కారణంగా ఆ చిన్నారికి ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటనకు సంబంధించిన CCTV వీడియో కూడా వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో ప్రమాదానాకి సంబంధించిన మొత్తం సంఘటన స్పష్టంగా కనిపిస్తోంది.