పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో సవాళ్లపర్వం పీక్ స్టేజ్‌కు చేరుతోంది. ఇప్పటికే.. బీఆర్ఎస్- కాంగ్రెస్ మధ్య సవాళ్లు హోరాహోరీగా కొనసాగుతుండగా.. తాజాగా బీజేపీ సీనియర్ నేత, ఎంపీ అభ్యర్థి బండి సంజయ్ కూడా ఎంట్రీ ఇచ్చారు. వంద రోజుల్లో ఆరు గ్యారెంటీలు అమలు చేస్తామన్న కాంగ్రెస్.. అమలు చేసినట్లు నిరూపిస్తే తాను పోటీ నుంచి తప్పుకుంటానని బండి సంజయ్ ప్రకటించారు. ఆరు గ్యారెంటీలు అమలు చేసినట్లు కాంగ్రెస్ నేతలు నిరూపిస్తే పోటీ నుంచి తప్పుకుని.. కాంగ్రెస్ తరపున ప్రచారానికి సిద్ధమన్నారు. తన సవాల్‌ను స్వీకరించే దమ్ము కాంగ్రెస్ నేతలకు ఉందా అని ఛాలెంజ్ విసిరారు బండి సంజయ్.