ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొన్న సైనిక వీరుడికి అపూర్వ స్వాగతం

మెదక్ జిల్లా శివంపేట్ మండలం పెద్ద గొట్టుముక్కల గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ సింగిరెడ్డి మధుసూదన్ రెడ్డి ఆపరేషన్ సింధూర్‌లో పాల్గొని స్వగ్రామానికి తిరిగి చేరుకున్న సందర్భంగా గ్రామస్తులు ఘన స్వాగతం పలికారు. డప్పు చప్పులు, పూలవర్షంతో ఊరిలోకి ఆహ్వానించిన వారు, విద్యార్థులు, ఉపాధ్యాయులు ఆయనకు సన్మానం చేశారు.