శివాలయాల్లో పంచారామాలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. ప్రముఖ పంచారామాల్లో ఒకటైన భీమవరం సోమేశ్వరాలయానికి మరో విశిష్టత ఉంది. ఇక్కడ శివలింగం కాలానికి తగ్గట్టు రంగులు మారుతూ భక్తులకు దర్శనం ఇస్తుంటుంది. అమావాస్య రోజున గోధుమ వర్ణంలో భక్తులకు స్వామివారు దర్శనం ఇస్తారు. ఇక పౌర్ణమి వచ్చేసరికి తెల్లని వర్ణంలో మెరిసిపోతుంటారు.