సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్ద రణరంగం.. ఎక్కడికక్కడ అరెస్టులు

హైదరాబాద్‌లోని చిక్కడపల్లి సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్ద సోమవారం రాత్రి తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ వాయిదాతోపాటు, గ్రూప్‌ 2,3 పోస్టులు పెంచాలంటూ నిరుద్యోగులు ఆందోళనలు చేపట్టారు. అయితే అక్కడికి చేరుకున్న పోలీసులు.. నిరసనకారులను అరెస్టు చేయడంతో అక్కడి వాతావరణం ఉద్రిక్తంగా మారింది. గ్రూప్‌ 2,3 పోస్టులు పెంచాలని పెద్ద ఎత్తున అభ్యర్ధులు సిటీ సెంట్రల్‌ లైబ్రరీ వద్దకు చేరుకుని, నిరసన తెలిపారు. శాంతియుతంగా ర్యాలీ తీస్తామని పోలీసులను కోరినా వారు నిరాకరించారు. లైబ్రరీ మెయిన్‌ గేటు దాటి బయటకు వస్తే అరెస్టు చేస్తామని హెచ్చరించారు.