కోర్కెలు తీర్చే కొంగు బంగారం.. ఐనవోలు మల్లన్న బ్రహ్మోత్సవాలు ఆరంభమయ్యాయి.. సంక్రాంతి నుండి ఉగాది వరకు మూడునెలల పాటు సాగే ఈ జాతరకు భక్తులు పోటెత్తారు.. ఈ ఏడాది మేడారం సమ్మక్క సారలమ్మ జాతర కలిసి రావడంతో ఆలయానికి భక్తుల తాకిడి మరింత పెరగనుంది. లక్షల సంఖ్యలో మల్లన్న దర్శనానికి వచ్చే భక్తుల కోసం అధికారులు సకల సౌకర్యాలు కల్పించారు..ఎత్తు బోనాలు.. శివసత్తుల పూనకాలు.. పెద్ద పట్నాలతో కన్నుల పండువగా సాగే మల్లికార్జున స్వామీ జానపదుల జాతర