హైదరాబాద్ నగరంలోని కాచిగూడ రైల్వే స్టేషన్‌లో ఆదివారం రాత్రి ఓ షాకింగ్ ఘటన చోటుచేసుకుంది.. రైలు దిగుతూ.. కిందపడిన యువకుడిని.. అక్కడున్న వారు రెప్పపాటులో కాపాడారు.. వరంగల్‌కు చెందిన సాదుల మణిదీప్ (31) బెంగళూరుకు వెళ్లేందుకు కాచిగూడ రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. సాధారణ టికెట్ తీసుకున్న అతడు, రైలు వచ్చేసరికి గందరగోళంలో ఏసీ ఫస్ట్ క్లాస్ బోగీ హెచ్‌ఎ1 లో ఎక్కాడు.. కొద్ది సేపటికే తన పొరపాటు తెలుసుకున్న మణిదీప్, రైలు కదిలిపోతున్న సమయంలో కిందకు దిగేందుకు ప్రయత్నించాడు.