మాడు పగిలే ఎండలు, వడగాలులతో అల్లాడిపోతున్న తెలుగు రాష్ట్రాల ప్రజలకు, భారీ వర్షాలతో కాస్త ఉపశమనం కలిగింది. అటు ఏపీ, ఇటు తెలంగాణ...రెండు రాష్ట్రాల్లో గాలి వానతో అలజడి రేగింది. అటు రాజకీయ పార్టీల సభలు, సమావేశాలకు వర్షం బ్రేకులు వేసింది.