దొంగలు సైతం అప్‌గ్రేడ్ అయ్యారు. అంది వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ దోచేస్తున్నారు. ఒక పోలీసుల సైతం రేంజ్‌లో చోరీ కేసులు ఛేదిస్తున్నారు. దొంగలు కామన్ గా బంగారం, వెండి మరియు బైకులు దొంగతనాలు చేస్తుంటారు. కానీ ఈ దొంగ మాత్రం వెరైటీ, ఒక్క దొంగతనంతో జీవితంలో సెటిల్ అయిపోవాలని అనుకున్నాడో ఏమో ఏకంగా లారీని దొంగిలించాడు. పాపం కానీ సీన్ రివర్స్ అయింది. టెక్నాలజీ పెరిగిపోవడంతో యజమాని తన లారీ చోరీకి గురైందని గుర్తించాడు. జిపిఎస్ ద్వారా తన లారీని పట్టుకున్నాడు. చివరికి దొంగ దెబ్బల పాలై కటకటాల వెనక్కి వెళ్ళాడు. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు లో చోటుచేసుకుంది.