Heavy Rains: పలు రాష్ట్రాల్లో వరుణ బీభత్సం.. వరదలతో కొట్టుకుపోతున్న బైకులు, ఆటోలు

దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. అయితే తాజాగా గుజరాత్‌లో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో భావ్‌నగర్‌లోని సిహోర్‌లో వరదలు సంభవించాయి. ఈ వరదల్లో బైకులు, ఆటోలు, స్కూటీలు తదితర వస్తువులు సైతం కొట్టుకుపోతున్నాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.