చూస్తుండగానే వరదలో కొట్టుకుపోయిన కారు.. షాకింగ్ వీడియో

మొంథా తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో రెండ్రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో కల్వకుర్తి మండ‌లం ర‌ఘుప‌తిపేట వ‌ద్ద ఉన్న దుందుభి న‌దికి వరద ఉధృతి పెరిగింది. దీంతో నది ఉప్పొంగి ప్రవ‌హిస్తుంది. నది నీరు రోడ్డుపై నుంచి ప్రవహిస్తుండడంతో క‌ల్వకుర్తి, నాగ‌ర్‌క‌ర్నూల్ మ‌ధ్య రాక‌పోక‌లు నిలిచిపోయాయి. లింగాల మండలం అవుసలికుంట- అంబటిపల్లి గ్రామాల మధ్య వాగు దాటేందుకు ప్రయత్నించి ఒక కారు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. కారు ఉన్న వ్యక్తులు కాపాడలని కేకలు వేయడంతో గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.