నక్కతో పోరాటం.. నాపైనే దాడి చేస్తావా అంటూ రైతు ఏం చేశాడో చూడండి!

విజయనగరం జిల్లాలో షాకింగ్ ఘటన వెలుగు చూసింది. పొలాల్లో పనిచేస్తున్న నలుగురు రైతులపై ఒక్కసారిగా ఒక నక్క దాడి చేసింది. అక్కడి నుంచి వెళ్తూ మరో రైతుపై దాడి చేసేందుకు ప్రయత్నించింది. కానీ అతని దగ్గర దాని పప్పులు ఉడకలేదు. తనపై దాడి చేసేందుకు వచ్చిన నక్కపై ఆ రైతులు పిడుగుద్దులు కురిపించాడు. దీంతో ఆ నక్క అక్కడికక్కే ప్రాణాలు వదిలింది.