ఉత్తరాఖండ్‌లో బుధవారం అక్షయ తృతీయ సందర్భంగా చార్‌ధామ్ యాత్ర ప్రారంభమైంది. ఇందులో భాగంగా ఉత్తర్‌కాశీ జిల్లాలోని గంగోత్రి, యమునోత్రి ఆలయ ద్వారాలను వేద మంత్రాల నడుమ తెరిచారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి భక్తులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ యాత్ర సనాతన ధర్మం యొక్క భక్తి, విశ్వాసం, ఆధ్యాత్మిక భావోద్వేగాలకు ప్రతీకగా నిలుస్తుందన్నారు. కేదార్‌నాథ్ శుక్రవారం, బద్రీనాథ్ ఆదివారం తెరుచుకోనున్నాయి.