లేడీ అఘోరీ మరోసారి హల్చల్ చేసింది. ఆలయ రాజగోపురం నుండి ప్రధాన ద్వారం గుండా స్వామివారి దర్శనం కల్పించాలని ఆలయ అధికారులను కోరింది. అందుకు ఆలయ సిబ్బంది నిరాకరించడంతో హంగామా సృష్టించింది. ఏకంగా తన దగ్గర ఉన్న కత్తితో ఆలయం వద్ద ఉన్న భక్తులపైకి దూసుకెళ్లింది. ఆ ఘటనతో అక్కడ ఉన్న భక్తులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.