ఈ మధ్యకాలంలో తరచూ వణ్యప్రాణులు జనావాసాల్లోకి వస్తున్నాయి. వాటిని చూసిన జనాలు భయాందోళనకు గురై వాటిని చంపేయడమో లేదా ఫారెస్ట్ ఆఫీసర్లకు అప్పటించడమో చేస్తున్నారు. తాజాగా అలాంటి ఘటనే విశాఖ జిల్లాలో వెలుగు చూసింది. విశాఖ తుంగ్లాం ఏరియాలో ఓ కాలువ ఉంది. ఆ రోడ్డులో జనం నిత్యం అటు ఇటూ తిరుగుతూ ఉన్నారు. ఇంతలో ఓ వ్యక్తికీ ఏదో శబ్దం వినిపించింది. అటుగా వెళుతున్న ఆ వ్యక్తి ఆగి ఒక్కసారిగా కాలువ వైపు చూశాడు.అక్కడ ఏదో కదులుతున్నట్టు అతను గుర్తించారు. ఏంటా అని కాస్తా దగ్గరకి వెళ్లి తొంగిచూశాడు. ఇంకేముంది భారీ పాము అతని దృష్టిలో పడింది. దీంతో ఆతను ఒక్కసారిగా కంగుతిన్నాడు. గుండెలు చేతపట్టి వెనక్కి జరిగాడు. ఇక వెంటనే స్థానికులకు సమాచారం అందించాడు. విషయం ఆ నోట ఈ నోట పాకి స్నేక్ క్యాచర్ దృష్టికి వెళ్లింది. దీంతో స్నేక్ క్యాచర్ సొసైటీ కిరణ్ కుమార్ హుటాహుటీనా ఘటనా స్థలానికి చేరుకున్నాడు.