దువ్వాడ ఇంటి గుట్టు కథా చిత్రమ్‌లో మరో ట్విస్ట్..!

టెక్కలిలోని MLC దువ్వాడ శ్రీనివాస్ నివాసం....గత 2 వారాలుగా సంచలనాలకు కేంద్ర బిందువుగా మారింది. దువ్వాడ, వాణి, మాధురి.. ఇంటి గుట్టు-ఇంటి చుట్టూ కథా చిత్రమ్‌లో తాజాగా మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. నిన్నటి వరకు MLC నివాసంగా ఉన్న భవనం నేడు MLC క్యాంపు కార్యాలయoగా మారిపోయింది. వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయం, టెక్కలి నియోజకవర్గం, ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్‌ క్యాంప్‌ ఆఫీస్‌ అంటూ గోడలకు ఫ్లెక్సీలు వెలిశాయి. దీంతో దువ్వాడ ఇల్లు కాస్తా...క్యాంప్‌ ఆఫీసుగా మారిపోయింది.