ఆ ఊరి పాఠశాలకు ఒకే టీచర్.. ఒకే విద్యార్థి !

ప్రైవేట్ స్కూళ్లకు దీటుగా.. ఏ మాత్రం తీసిపోకుండా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు పెంచుతూ... విద్యనందిస్తున్నామని ప్రభుత్వాలు చెబుతున్నాయి. కానీ ఎందుకో ఇంకా చాలామంది తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలు అంటే చిన్న చూపే చూస్తున్నారు. ఒకప్పుడు విద్యార్థులతో కళకళలాడిన ఓ పాఠశాల.. ప్రస్తుతం వెలవెలబోతుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులను చేర్పించండి అని విద్యాశాఖ ఎన్ని అవగాహన కార్యక్రమాలు చేపట్టినా.. ప్రైవేట్ స్కూళ్ల మోజులో పడి తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో తమ పిల్లల్ని చేర్పించడానికి ఇష్టపడడం లేదు. ఒకప్పుడు వంద మందికి పైగా విద్యార్థులు ఉన్న ఆ పాఠశాలలో రానురాను విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గిపోయి.. ప్రస్తుతం ఒక్క విద్యార్థి మాత్రమే మిగిలారు. అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం కాశేపల్లిలోని మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతున్న ఆ ఒక్క విద్యార్థి