ప్యాసింజర్‌ రైలు ప్రయాణికులకు వింత అనుభవం!

విశాఖ పట్నం నుంచి భవానీ పురం బయల్దేరిన ప్రయాణికులకు సరికొత్త అనుభవం ఎదురైంది. ట్రైన్ లో సిబ్బంది అంతా మహిళలే కావడంతో కాసేపు అమితాశ్చర్యానికి లోనయ్యారు ప్రయాణికులు అంతా. లోకో పైలట్, కో పైలట్, గార్డ్, టికెట్ కలెక్టర్లు, అటెండెంట్లు, ఇతర సహాయ సిబ్బందినే కాకుండా చివరికి రక్షణ విధులు నిర్వర్తించే భద్రతా దళాలు కూడా మహిళా సిబ్బందే ఉండడంతో ప్రయాణికులు సరికొత్త అనుభూతికి లోనయ్యారు.