అనకాపల్లి జిల్లా బాపాడుపాలెం ప్రభుత్వ పాఠశాలలో ఒకటి తరగతి చిన్నారి ఆరాధ్య రూపొందించిన మైండ్ మ్యాప్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఆ చిట్టి తల్లి సృజనాత్మకతకు మంత్రి నారా లోకేష్ నుంచి ప్రత్యేక అభినందనలు వచ్చాయి. ప్రభుత్వ పాఠశాలల్లో అసాధారణ ప్రతిభకు ఇది నిదర్శనం. ఓ ఉపాధ్యాయుడి మార్గదర్శనంతో చిన్నారి అద్భుతం సాధించింది.