కూటమీ ప్రభుత్వం కొలువుదీన వెంటనే ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు నాలుగు వేల రూపాయల పెన్షన్ ఇచ్చేందుకు సిద్దమైంది. వీటితో పాటు మూడు నెలలకు గాను మరొక మూడు వేలు జత చేసి తొలి పెన్షన్ మొత్తం ఏడు వేల రూపాయలకు పెంచి ఇచ్చింది కూడా. అప్పట్లో సీఎం చంద్రబాబు ఏకంగా తాడేపల్లిలోని పాములు నాయక్ ఇంటికి వెళ్లి మొదటి పెన్షన్ లబ్దిదారులకు అందించారు. చంద్రబాబు పాములు నాయక్ ఇంటికి వెళ్లి వారికి పెన్షన్ అందించడమే కాకుండా.. వారిచ్చిన టీని కూడా సేవించారు.