అపదలో ఉన్న పసికందు కోసం ఓ తండ్రి వ్యథ..!

కాకినాడ జిల్లా కోటనందూరు గ్రామానికి చెందిన అల్లు శిరీష అనే గర్భిణికి నెలలు నిండకుండానే పురిటి నొప్పులు రావడంతో ఆమె కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం విశాఖలోని కేజీహెచ్ ప్రసూతి విభాగంలో చేర్పించారు. అయితే నెలలు నిండకుండానే శిరీష ఓ బిడ్డకు జన్మనిచ్చింది. దీంతో బిడ్డకు కాస్త పరిపక్వత వచ్చే వరకు నియోనేటల్ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ లో ఉంచాల్సి ఉంటుందని వైద్యులు తెలిపారు. నెలలు పూర్తి కాకుండానే జన్మించిన ఆ శిశువును పిల్లల వార్డుకు అనుబంధంగా ఉండే ఎన్ఐఐసీయూలో ఉంచాలని వైద్యులు సూచించడంతో ఆ పసికందును తక్షణం ఆ వార్డుకు తరలించాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ ఆ సమయానికి అక్కడ సిబ్బంది లేదు. ఆక్సిజన్ పెట్టి ఎన్ఐసీయూ కు తీసుకెళ్ళాల్సి రావడంతో ఆ ఆక్సిజన్ సిలిండర్ ను మోసే శక్తి అక్కడ ఉన్న మహిళా సిబ్బంది కి లేదు. దీంతో తండ్రి ఆ బాధ్యతను తీసుకున్నాడు తండ్రి అల్లు విష్ణు మూర్తి.