సహజంగా వీధి కుక్కలను చూసి వానరాలు భయపడుతాయి. కుక్క అరిచిన శబ్దం వినిపించినా అక్కడి నుండి పరుగో పరుగని పరుగులు పెడతాయి. కానీ ఇక్కడ మాత్రం దానికి బిన్నంగా ఓ విచిత్ర సీన్ జరిగింది. ఓ కోతి కుక్కకు చుక్కలు చూపించింది. కుక్క వీపు పైకి ఎక్కి కూర్చున్న కోతి దేకో మై రౌడీయిజం అన్నట్లుగా వీధికుక్కను పరేషాన్ చేసింది.. ఆ సీన్ చూసిన ప్రతి ఒక్కరు అవాక్కయ్యారు .