ఒంటి నిండా బంగారంతో అలంకారప్రియుడి వద్దకు..!

న్యూ ఇయర్ రోజు శ్రీవారిని దర్శించుకునేందుకు తిరుమల కొండపైకి వచ్చిన ఓ భక్తుడు అందరిని ఆకట్టుకున్నాడు. హైదరాబాద్‌కు చెందిన తెలంగాణ ఒలింపిక్ సంఘం సంయుక్త కార్యదర్శి కొండా విజయ్ కుమార్ దాదాపు 5 కిలోల బంగారు ఆభర ణాలు ధరించి తిరుమల వెంకన్నను దర్శించుకున్నారు. మెడలో బంగారు గొలుసుతో పాటు, చేతికి కూడా బంగారు ఆభరణాలు ధరించిన విజయ్ కుమార్‌ను తోటి భక్తులు ఆసక్తిగా గమనించారు. విజయ్‌ కుమార్ తరచూ తిరుమల వెంకన్న స్వామి దర్శనానికి వస్తుంటారు. వచ్చిన ప్రతిసారి బంగారంపై తనకున్న ఆసక్తిని ప్రదర్శిస్తూనే ఉన్నారు. పసిడిపై ఉన్న ప్రేమతో భారీ ఆభరణాలు చేయించుకొని ధరిస్తున్నట్లు విజయ్ కుమార్ చెబుతున్నారు.