ప్యారడైజ్ హోటల్‌లో ఫైర్ యాక్సిడెంట్..

ప్యారడైజ్ హోటల్‌లో ఫైర్ యాక్సిడెంట్.. మిట్ట మధ్యాహ్నం వేళ.. కడుపులో నకనకలాడే కస్టమర్లు రుచికరమైన బిర్యానీని కడుపారా ఆరగిద్దామని భావించారు. బిల్లు చెల్లించి బిర్యానీ కోసం ఎదురు చూడసాగారు. కాసేపటికి వేడి వేడి బిర్యానీని సర్వర్లు తెచ్చి ప్లేట్లల్లో వడ్డించారు. ఇష్టమైన బిర్యానీని తినే టైమ్‌కు ఒక్కసారిగా ప్యారడైజ్ హోటల్ భవనానికి మంటలు అంటుకున్నాయి. సెల్లార్‌లోని జనరేటర్ నుంచి వచ్చిన మంటలు క్షణాల్లో ఉవ్వెత్తున ఎగిసిపడ్డాయి. బిర్యానీ భోజనాలు వదిలి ఇంతలో ఎటు వాళ్ళు అటు పరుగెత్తారు.