పాఠం చెబుతుండగా పెద్ద శబ్ధం.. ఉలిక్కిపడిన టీచర్.. భయాందోళనలో విద్యార్థులు..
అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు ఏజెన్సీలో విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింది. పాఠశాల భవనం పైకప్పు పెచ్చులూడి నేలపడడంతో ఒక్కసారిగా విద్యార్థులు భయాందోళనలకు గురయ్యారు. అదృష్టవశాత్తూ విద్యార్థులు ఆ ప్రాంతంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది