ఆకట్టుకుంటున్న అమరావతి క్వాంటం వ్యాలీ నిర్మాణ నమూన.. బిల్డంగ్స్ బలే ఉన్నాయిగా

ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో క్వాంటం వ్యాలీ రూపకల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన భవన నమూనాలను సచివాలయంలో ఏర్పాటు చేసిన అధికారులు సమీక్షించారు. అమరావతిని టెక్నాలజీ ఆధారిత పరిశ్రమలకు కేంద్రంగా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ఈ ప్రాజెక్ట్‌ను ముందుకు తీసుకెళ్తోంది. లింగాయపాలెం సమీపంలోని సీడ్ యాక్సెస్ రోడ్డును ఆనుకుని సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో క్వాంటం వ్యాలీ నిర్మాణం జరగనుంది. వచ్చే ఏడాది జనవరి నుంచే ఇక్కడ ప్రాథమిక స్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ప్రాజెక్ట్ నిర్మాణానికి అవసరమైన మౌలిక సదుపాయాల పనుల్లో అధికారులు దీంతోపాటు వేగం పెంచుతున్నారు.