సిద్దిపేట జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్న ఓ వ్యక్తి ఆర్టీసీ బస్సు టైర్ల కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. సిద్దిపేట పొన్నాల దాబాల వద్ద ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో రోడ్డుపై ఓ వ్యక్తి నడుకుంటూ వెళ్లడం కనిపిస్తుంది. అయితే అతడు నడి రోడ్డులో నడుస్తుండటంతో వాహనాలు అతడిని తప్పించుకుని వెళ్లడం వీడియోలో కనిపిస్తుంది. ఇంతలో సదరు వ్యక్తి వెనుక నుంచి ఓ ఆర్టీసీ బస్సు వచ్చింది. బస్సు హారన్ కొట్టడంతో వెనక్కి తిరిగి చూసిన ఆ వ్యక్తి.. ఉన్నట్లు బస్సు దగ్గరికి వెళ్లి దాని టైర్ల కింద పడిపోయాడు.