తిరుపతిలో కలకలం సృష్టించిన యువకుడిపై లాఠీతో దాడి చేసిన ఘటన ఆసక్తికరంగా మారింది. పవన్ అనే యువకుడు బైక్‌ను రెంట్‌కు తీసుకుని అద్దె చెల్లించకపోగా.. ఆ బైక్‌ను తాకట్టు పెట్టాడనే కారణంతో అతనిపై కొందరు దాడి చేశారు. దీనికి సంబంధించి బాధితుడి తల్లిదండ్రుల ఫిర్యాదుతో అనిల్‌రెడ్డి, జగ్గారెడ్డి అలియాస్ జగదీష్, దినేష్ అనే ముగ్గురు వ్యక్తులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.