స్నేకా.. మజాకా..! టీచర్ స్కూటీలో దూరిన కట్ల పాము.. ఎంత పనిచేసిందంటే..?

స్నేకా.. మజాకా..! టీచర్ స్కూటీలో దూరిన కట్ల పాము.. ఎంత పనిచేసిందంటే..? పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిధిలోని ఓ గ్రామంలో యాక్టివా స్కూటర్‌లో దూరిన కట్లపాము హల్చల్ చేసింది. స్థానికంగా ఒక స్కూల్లో పని చేస్తున్న టీచర్ తన పిల్లలతో ఉదయాన్నే యాక్టివా పై స్కూల్ కి బయల్దేరింది. స్కూటర్ పై వెళుతుండగా ఒక్కసారిగా ఫ్రంట్ హెడ్లైట్ నుండి కట్లపాము చేతి దగ్గరికి వచ్చేసింది. భయాందోళనకు గురైన ఆమె వెంటనే స్కూటర్‌ను పక్కన వదిలేసి భర్తకు సమాచారం అందించింది.