తల్లి వివాహేతర సంబంధం గొడవ.. ఏడాది పసికందు మృతి!

చంద్రగిరి కి చెందిన ప్రసన్న భర్త గతేడాది జూలైలో మృతిచెందాడు. అప్పటికే గర్భవతిగా ఉన్న ప్రసన్నకు కూతురు పుట్టింది. ప్రస్తుతం ఏడాది వయసున్న కూతురు దీక్షిత తో చంద్రగిరిలో నివాసముంటున్న ప్రసన్నకు సుబ్రమణ్యం అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. భర్తకు మంచి స్నేహితుడైన సుబ్రమణ్యంతో కాస్తా సహజీవనం కు కారణమైంది. గత కొంతకాలంగా సుబ్రహ్మణ్యంతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నారు. వివాహేతర సంబంధం కొనసాగిస్తున్న ప్రసన్న వ్యవహారం సుబ్రమణ్యం భార్య ఉమకు తెలిసిపోయింది.