పంద్రాగస్టులో ఎగరని పావురం.. క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలంటే కలెక్టర్‌కు లేఖ

దేశ వ్యాప్తంగా పలు చోట్ల ఆగస్టు 15న గణతంత్ర వేడుకలు అట్టహాసంగా జరిగిన సంగతి తెలిసిందే. ప్రతియేట జండా వందన కార్యక్రమాల్లో ప్రేమ, స్వేచ్ఛ, శాంతికి ప్రతీకగా భావించే పావురాలను ఎగురవేయడం పరిపాటి. ఛత్తీస్‌గఢ్‌లోని ముంగేలిలో కూడా పంద్రాగస్టు స్వాతంత్ర్య వేడుకలు జరిగాయి. అయితే ఈ కార్యక్రమానికి హాజరైన నేతలు తమ చేతుల్లోకి పావురాలను తీసుకుని ఎగరవేసేందుకు యత్నించారు. ఇక్కడే అసలు కథ మొదలైంది. అతిధులుగా విచ్చేసిన పోలీసు సూపరింటెండెంట్ గిరిజా శంకర్ జైస్వాల్, బీజేపీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పున్నూలాల్ మోహ్లే, ముంగేలి కలెక్టర్ రాహుల్.. ఈ ముగ్గురిలో ఇద్దరు ఎగురవేసిన పావురాలు చక్కగా ఎగురుకుంటూ వెళ్లిపోయాయి.