రుణ మాఫీతో తెలంగాణ రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. గత ప్రభుత్వాలు చేయలేని పనిని.. కాంగ్రెస్ సర్కార్ చేసి చూపించిందని అనందం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్నదాతల రుణ మాఫీ సంబరాలు అంబరాన్నంటాయి. మొదటి విడత ప్రకటించిన జాబితాలో వారి రుణాలు మాఫీ అవుతుండడంతో రైతులు ఆనందంతో ఉప్పొంగి పోతున్నారు. పంట పొలాల్లోనే కేక్ కట్ చేసుకుని మిఠాయిలు పంచుకున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి కృతజ్ఞతలు తెలుపుతూ సంబరాలు జరుపుకుంటున్నారు.