విజయనగరం జిల్లా ఎస్.కోట మండలం బొడ్డవర పంచాయతీ భవానీనగర్‌లో ఒక ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. ప్రకాష్ అనే రైతు తన ఇంట్లో కోళ్లు పెంచుతున్నాడు. ఈ క్రమంలో సాయంత్రం కోళ్లను పట్టుకొని గంప కింద వేశాడు.. ఆ తరువాత కొద్దిసేపటికి కోళ్ల గూడులోకి ఒక పెద్ద కోడెనాగు పాము ప్రవేశించి రెండు కోళ్లను కాటేసింది. అంతటితో ఆగకుండా కోళ్లు పెట్టిన మూడు కోడిగుడ్లను కూడా మింగేసింది.