అదును వచ్చింది.. జోరుగా వర్షాలు కురుస్తాయనుకుంటే ఒక్క చుక్క వర్షం లేదు.. పుడమి భీడువారుతుంది. వర్షాకాలం కదా చిన్నపాటి వర్షం కురిసినా నేలతల్లి తడుస్తుంది.. ఏదో సాగు చేసుకొని బ్రతుకు బండి లాగొచ్చు అనుకున్న రైతన్నలకు ఈ ఏడాది కూడా ఆశాజనకంగా లేదు. ఇక చేసేది లేక తమ పూర్వీకుల నుండి వస్తున్న అరుదైన సంప్రదాయ ఆచారాన్ని అమలు చేసి వర్షపు నీటిని పొందాలని నిర్ణయించుకున్నారు. అనుకున్నదే తడువు పెద్దలు చెప్పిన ఆచారాన్ని అమలుచేశారు.